చిట్టెమ్మ,చిట్టియ్య గారు బాగా వృద్ధదంపతులు.ఒకరికి తొంభై,ఒకరికి ఎనభైసంవత్సరాలు.ఇద్దరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.పదిమంది సంతానంలో ఆరుగురు ఉన్నారు.ఉద్యోగరీత్యా అందరూ దూరంగా ఉంటారు.ఈమధ్యనే చిట్టెమ్మ గారికి బాగోకపోతే పిల్లలకు కూడా చెప్పకుండా ఆయనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకున్నారు.మనిమనిషి పనులు చేసి వెళ్ళిన తర్వాత ఇద్దరూ పిల్లల ముచ్చట్లుచెప్పుకుంటూ,ఒకరికి
ఒకరు చేదోడువాదోడుగా ఉంటూ కాలక్షేపం చేసేవాళ్ళు.సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చేవారు.అనుకోకుండా ఒకరోజు పెద్దల్లుడు వచ్చి పొలం గురించి గొడవ పెట్టుకునేసరికి పెద్దాయనకు రక్తప్రసరణ వేగం పెరిగి క్రిందపడిపోయి కోమాలోకి వెళ్ళి మూడు రోజులకు చనిపోయేసరికి చిట్టెమ్మగారు తట్టుకోలేకపోయింది.ఒకరికొకరు తోడునీడగా ఉండే వాళ్ళల్లా అకస్మాత్తుగా చిట్టెయ్యగారిని కోల్పోయేసరికి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టింది.నేనుపోయి ఆయన ఉన్నా బాగుండేది అంటూ కాసేపటికి ఒకసారి ఏడవడం మొదలుపెట్టింది.ఒకకోడలికి ఆమె అంటే అంతగా
పడదు కనుక మాఅత్త కొత్తగా పెళ్ళైనదానిలాగా ఏడుస్తుంది అని స్నేహితురాలికిచెప్పింది.ఈవయసులోమానసికంగా దగ్గరితనం ఏర్పడుతుంది కనుక అకస్మాత్తుగా అలా జరిగేసరికిషాక్ లో అలాప్రవర్తిస్తుంది.కొద్దిరోజులకు ఆమెలో మార్పురావచ్చు.మీ అందరూ ఆమెతో ప్రేమగా ఉండి ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు మీఇళ్ళకు తీసుకురండి అంది. ఇక చిట్టెమ్మ గారి కోడలు మారు మాట్లడలేకపోయింది.

No comments:
Post a Comment