శశాంక్,శర్మిష్ట భార్యాభర్తలు.ఇద్దరూ వైద్యులు.ఇద్దరూ వేరువేరు ప్రాంతాలలో చదువుకున్నారు.శశాంక్ వివాహానికి ముందే విదేశాలకు వెళ్ళి చదువుకుంటూ ఉద్యోగం చేస్తున్నాడు.శర్మిష్ట వేరే దేశంలో చదువుకుంటుండగా ఇరువైపుల పెద్దలు వీరిఇద్దరికి ఒకరినొకరు ఇష్టపడటంతో వివాహం చేశారు.శర్మిష్ట తన
చదువు పూర్తవగానే శశాంక్ పనిచేసే దేశానికి వెళ్ళింది.శర్మిష్ట వెళ్ళినతర్వాత ఒక సంవత్సరంవరకు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రాలేదు.అనుకోకుండా చాలారోజుల తర్వాత శశాంక్ పనిచేసే ఆసుపత్రి నుండి పిలుపు వచ్చింది.కానీ అక్కడి సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో శశాంక్ భార్య శర్మిష్ట అన్నవిషయం తెలిసి ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో పనిచేయకూదడనే నిబంధన కారణంగా శర్మిష్టకు ఉద్యోగం ఇవ్వలేమని తేల్చిచెప్పారు.బయటకు రాగానే శశాంక్ తో
పాటు పనిచేసే వైద్యురాలితో ఇంతముందే శశాంక్ ఇక్కడ పనిచేస్తున్నాడు కనుక తనకు ఉద్యోగం ఇవ్వమన్నారని బాధపడుతూ చెప్పింది.ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య బాధపడటంతో శశాంక్ భార్య మీదఉన్న అమితమైన ప్రేమతో తను ఉద్యోగానికి రాజీనామా చేసి ఆఉద్యోగాన్నితన భార్య శర్మిష్టకు ఇవ్వమని యాజమాన్యాన్ని కోరాడు.భార్యకన్నా భర్త పైమెట్టు మీద ఉండాలని అనుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నఈరోజుల్లో భార్యకోసం ఉద్యోగాలు దొరకని రోజుల్లో చేస్తున్న ఉద్యోగాన్నివదిలేయటం నిజంగా అభినందించదగ్గ విషయం.

No comments:
Post a Comment