అరటికాయ ఆవడలు
పచ్చిఅరటికాయలు - 4
అల్లం - 10 గ్రా.
పెరుగు - 1 1/2 కప్పు
ఆవాలు - 1 స్పూను
కరివేపాకు - కొంచెం
ఎండు మిర్చి - 4
నూనె - వేయించటానికి సరిపడా
ఉప్పు - తగినంత
అరటికాయలు కడిగి రెండు చివరలు తీసేసి కుక్కర్ లో ఉడికించి పై చెక్కు వలిచి మెత్తగా చిదిపి ఉప్పు కలిపి గారెల ఆకారంలో కాగిన నూనెలో దొరగా వేయించి తీయాలి.పెరుగును బాగా గిలకొట్టి దానిలో తురిమిన అల్లం ముక్కలు,ఉప్పుకలపాలి.కొద్దిగా నూనెలో పోపు,మిర్చివేసి పెరుగులో కొంచెం జీరాపొడి,సన్నగా తరిగిన కొత్తిమీర
పెరుగులో కలిపి వడలపై పోయాలి.చాలా రుచిగా ఉంటాయి.
పైచెక్కుతో పచ్చడి
ఉడికించిన అరటికాయ పై చెక్కుపడేయకుండా పచ్చడి చేసుకోవచ్చు.లోపల మెత్తటి పదార్ధంతో వేపుడు కొంచెం నూనె వేసి ఉప్పు,వేపుడు కారం,వెల్లుల్లి వేసి నిమిషాలలో చేయవచ్చు.చింతపండు పులుసు పిండి ఉడికించిన అరటికాయ పెద్దముక్కలుగా కోసి,ఉల్లిపాయ,పచ్చిమిర్చి,ఉప్పు,సంబారు కారం,అల్లంవెల్లుల్లిపేస్ట్,మసాలాపొడి వేసి పులుసు రుచిగా చేయవచ్చు.పెరుగు,అల్లంవెల్లుల్లి పేస్ట్,ఉప్పు,కారం,గరం మసాలా వేసి కొంచెం నూనెతో కుర్మా చేయవచ్చు.
పచ్చడి :
ఉడికించి ఒలిచిన చెక్కు - 2 కాయలది
పచ్చి మిర్చి - 8
వెల్లుల్లి - 5 రెబ్బలు
జీరా 2 స్పూనులు
చింతపండు - చిన్న నిమ్మకాయంత
కొంచెం నూనెలో పచ్చిమిర్చి వేయించి,నానబెట్టిన చింతపండు వేసి మిక్సీలో మెత్తగా చేసి పై చెక్కు,జీరా వేసి వెల్లుల్లి వేసి,గడ్డపెరుగు కూడా వేసి కొంచెం నూనెతో కొత్తిమీర,కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి.పై చెక్కు వృధా కాకుండా ఉంటుంది.చాలా రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment