బెండకాయలు - 1/2 కే.జి
వేపుడు కారం - 1 1/2 స్పూను
పచ్చికొబ్బరి - కొంచెం
వెల్లుల్లి - 5 రెబ్బలు
నూనె - వేయించటానికి సరిపడా
కరివేపాకు - కొంచెం
తాలింపు దినుసులు
బెండకాయలు సన్నగా గుండ్రంగా కట్ చేసి ఒక పెద్దప్లేటులో పలుచగా ఆరబెట్టాలి.పట్టుకుంటే జిగురుగా లేనప్పుడు వేయించితే పొడిపొడిగా ఉంటుంది.వెంటనేకానీ,జిగురుగా ఉన్నా వేపుడు రుచిగా ఉండదు.
ఖాళీగా ఉన్నప్పుడు కట్ చేసి ఆరిపోయినతర్వాత ఫ్రిడ్జ్ లో ఒక బాక్స్ లో పెట్టుకుని ఉదయం వండుకోవచ్చు.వండే
ముందు బాండీలో వేయించటానికి సరిపడా నూనెపోసి కాగినతర్వాత బెండకాయముక్కలు వేసి దగ్గరే ఉండి త్రిప్పుతూ వేయించితే 10 ని.ల్లో అయిపోతుంది.డీప్ ఫ్రై అవకుండా,మెత్తగాలేకుండాముక్క వేగినతర్వాత రంధ్రాలున్న గరిటతో తీసి దానిమీద ఇంకొకటి పెట్టి నూనె నొక్కేసి ముక్కలు ఒకప్లేటులోపెట్టుకోవాలి.బాండీలోమిగిలిన నూనె తీసేసి ఒకగిన్నెలో పోసి అదేరోజు వేరే కూరకు లేదా పచ్చడికి వాడుకోవచ్చు.బాండీలోతాలింపు వేయటానికి
సరిపడా నూనె ఉంచాలి.దానిలో ఎండుమిర్చి,దినుసులన్నీ ఒక్కోస్పూను చొప్పున వేసి ,సన్నగా కట్ చేసిన వెల్లుల్లి,కరివేపాకువేసి వేగిన తర్వాత కొబ్బరి,ఉప్పు,వేపుడు కారం,బెండకాయ ముక్కలు వేసి రెండు ని.లు
వేయించితే నోరూరించే బెండకాయ వేపుడు రెడీ.పొడిపొడిలాడుతూ వేడివేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

No comments:
Post a Comment