కృతిక వాళ్ళ పనిమనిషి లక్ష్మి మనుమరాలికి నాలుగు సంవత్సరాలు.పనిచేస్తున్నంతసేపు మాట్లాడటం లక్ష్మి అలవాటు.ఒకరోజు మనుమరాలి ముచ్చట్లు చెపుతూ మామనుమరాలికి మామిడికాయలంటే మోసెత్తిందండీ
అంది.అంటే ఏమిటి?అంటే మీరు ఈసంవత్సరము మామిడికాయలు చాలాఇచ్చారు కదండీ.అవి అదేపనిగా తిని
అమ్మామ్మా!ఇకచాలు మోసెత్తిందంటుందండీ అంటే వెగటుపుట్టటం (మొహం మొత్తటం)అన్నమాట అంది.ఎవరు బజారుకు వెళ్తే వాళ్ళను మామిడికాయలు తెమ్మని పీక్కుతినేది.50 రూ.లు పెట్టినా రెండు కూడా రావు కదమ్మా!
మీరు ఇవ్వటంవల్ల ఇంటిల్లిపాదీ తృప్తిగా తిన్నాము.అందుకని పిల్లది అలాగంది అనిచెప్పింది.కృతిక వాళ్ళ అమ్మ,
తమ్ముడువాళ్ళు ఊరినుండి వస్తూ తోటకాయలు తీసుకుని రావటంవలన అందరితోపాటు లక్ష్మికి కూడా ఇచ్చేది.
అందుకే అంత సంతోషంగా తృప్తిగా తిన్నామని చెప్పింది.పాడైపోయిన తర్వాత పారేసుకునే బదులు బాగున్నప్పుడే మనతోపాటు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని కృతిక అభిప్రాయం.వృధాగా పడేయటం ఎందుకని ముందే ఇస్తుంటుంది.

No comments:
Post a Comment