Thursday, 24 July 2014

మహాపాతకం

               వెంకట్రావు చదువుకునేటప్పుడే స్నేహితులతో కలిసి మద్యం సేవించటానికి అలవాటుపడ్డాడు.క్రమంగా అది వ్యసనంగా మారింది.పెళ్ళయి పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది.వెంకట్రావుకు ఇద్దరు పిల్లలు.అమ్మాయి పెళ్ళయిపోయింది.అబ్బాయికి  బాగా పెళ్ళి వయసు వచ్చిందని ఏదోఒక వంకపెడుతున్నాడని
తండ్రి ఆవేదన.ఎలాగోలా ఒక సంబంధం కుదిరేట్లుగా ఉందిలే అనుకుంటే భార్య కోడలు కోట్లు కట్నంతెచ్చేదైతేనే
ఒప్పుకుంటానని కొడుకు ఉద్యోగం చేసే దగ్గరకు వెళ్ళి కూర్చుంది.వెంకట్రావు ఒక్కడే ఉండి తెగ తాగేసి ఏమీ తినక
వెక్కిళ్ళు వస్తుంటే చెల్లెలు వెంకట్రావు కొడుక్కి ఫోనుచేస్తే ఎత్తటంలేదని కూతురికి చేసింది.మీనాన్న మేమెవరం ఏమి పెట్టినా తినటంలేదు.పగలైతే మేము చూస్తాం.ఇంట్లో ఎవరూ లేకపోతే రాత్రిపూట పరిస్థితి ఏమిటి? మీ అమ్మ,మీరు ఎవరూ పట్టిచుకోపోతే ఎలా?అంది.కూతురు ఆయన ఏమైపోయినా ఫర్వాలేదు." ఆయన కడుపున పుట్టటమే
మహాపాతకం"(పాపం చేసుకోవటంవల్ల ఆయన కడుపున పుట్టాము)అనేసింది.మాఅమ్మఇన్నిరోజులు భరించింది  ఆయనవల్ల మాపరువు పోతుంది.మీఅందరూ ఉన్నారుగా చూచుకుంటారో?ఊరుకుంటారో?మాకనవసరం అంది.ఆయన దగ్గరున్న డబ్బు కావాలి మీకు. తెల్లారిలేస్తే మీనాన్నదగ్గరకువచ్చి నాన్నా నాకూతురికి వడ్డాణం చేయించు,ప్లాట్ కొనిపెట్టు అంటూ వచ్చిడబ్బుతీసుకెళ్ళేటప్పుడు లేని నామోషీ ఇప్పుడెందుకు?.అంతమాట మాట్లాడటానికి నోరెలావచ్చింది.భార్యపిల్లలు పట్టించుకోకపోతే మాసంసారాన్ని చక్కదిద్దట్లేదని మమ్మల్ని నానామాటలు అంటున్నావేళకు అన్నీ పంపిస్తున్నాము.మీరు చిన్నపిల్లలుకాదు.మీరే తెలుసుకోవాలి.అమ్మను చూసినట్లే నాన్నను తీసుకెళ్ళి వైద్యం చేయించి ప్రేమతో మార్చాలి. మాకు సంబంధంలేదని బాధ్యతారాహిత్యంగా  మాట్లడతావేమిటి?నాన్నకు బాగోకపోతే ఒక్కమాట మాతో అనలేదు అంటారని చెప్పాను ఇక మీఇష్టం.
ఉన్నన్నాళ్ళు ఉంటాడు మేం మాత్రం ఏం చేయగలం అని వెంకట్రావు చెల్లెలు అంది.వెంకట్రావు మాములుగా మంచివాడు. భార్యాబిడ్డలంటేఅతి ప్రేమ. పల్లెత్తు మాట అనడు.అమాయకురాలైన కూతురు అలా మాట్లాడుతుందని ఎవరూ అనుకోలేదు. తర్వాత రోజు భార్య,కొడుకు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్ళినా అది వేరే విషయం.కూతురు ముందు,వెనుక ఆలోచించకుండా మాట్లాడటం వలన సొమ్ము తినటానికైతే భార్యాబిడ్డలుకానీ వైద్యం చేయించి ఆఅలవాటు మాన్పించి మామూలు మనిషిగా మార్చొద్దా?చిన్నప్పుడు పిల్లలబాగోగులు చూస్తాం,పిల్లలు పెద్దయిన తర్వాత తల్లిదండ్రుల బాగోగులు చూడాలి.మహాపాతకం చేసుకుని పుట్టాం అనటం ఎంత తప్పు.ఆయనకడుపున పుట్టబట్టి మంచిసంబంధంవచ్చి సుఖపడటంవల్ల పోకిళ్ళుపోతుంది అని ఊరంతా చెప్పుకుంటున్నారు.

2 comments:

  1. మీరు ఇది ఏం చెబుదామని రాసారో నాకసలు అర్ధం కాలేదు
    http://ahmedchowdary.blogspot.com

    ReplyDelete
    Replies
    1. ఎవరి కడుపున ఎవరు పుట్టాలో నిర్ణయించేది భగవంతుడు.తల్లి,తండ్రి దైవంతో సమానం.కూతురిగా ఆమాట ఆమె మాట్లాడకూడదు.తల్లిదండ్రులు పిల్లల్నిఎంతో ప్రేమతో పెంచి పెద్దచేసి ఒక స్థాయికి తీసుకొస్తారు.పిల్లలు పెద్దయినతర్వాత తల్లిదండ్రులను ప్రేమతో జాగ్రత్తగా చూచుకోవాలి.డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు.తల్లిదండ్రులపట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు.వ్యసనపరుడైనా తగిన వైద్యం చేయించి ప్రేమతో మార్చగలగాలి.అప్పుడే జన్మకు సార్ధకత.

      Delete